ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ‘పుష్ప: ది రూల్’ యూనిట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. ‘పుష్ప 2’ టీజర్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో భారీ విజయం సాధించిన, ఉత్తమ నటుడిగా బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చిన ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్ ‘పుష్ప 2’. దాంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇవాళ విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచిందని చెప్పవచ్చు.