Trending Now

ఈ నెల 24న రఘువీర్ రెడ్డి నామినేషన్ : మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఈనెల 24న నామినేషన్ వేస్తారని రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మంత్రి మాట్లాడారు. నామినేషన్ రోజున ఉదయం 9 గంటలకు నల్లగొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 12 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జెట్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పలువురు కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News