ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సరూర్ నగర్ జన జాతర సభ అనంతరం సిటీ బస్లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సందడి చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సరూర్ నగర్ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అందిస్తున్న పథకాల గురించి వివరించారు. తాము అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా వీటిని అమలు చేస్తామన్నారు. తిరుగు ప్రయాణంలో దిల్సుఖ్నగర్ వద్ద ఆర్టీసీ బస్ ఎక్కారు రాహుల్ గాంధీ. ఈయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. బస్ ఎక్కిన రాహుల్, సీఎం రేవంత్ రెడ్డిలు కాంగ్రెస్ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ బస్ అమలు అవుతున్న తీరుపై మహిళలతో మాట్లాడారు. బస్సులోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలు అందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు వివరించి హస్తం పార్టీకి ఓటు వేయాలని కోరారు.