ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3: కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 5 న నిర్మల్‌లో నిర్వహించే సభ శోభయామానంగా నిర్వహించుకునేందుకు సకల ఏర్పాట్లు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ధనసరి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావును పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం అగ్ర నేతలు పాల్గొన్నబోయే సభ స్థలాన్ని వారు వివిధ హోదాలలో ఉన్ననాయకులతో కలిసి పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ రోడ్ ప్రాంతంలో ఈ నెల 5 న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ కు కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు హాజరుకానున్నారు.
ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా సభ ప్రాంగణంలో అన్ని రకాలు ఏర్పాట్లు చేపడుతామని, ప్రధానంగా జనం పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా జరగబోయే సభ కు హాజరు కనున్నారన్నారు. ట్రాఫిక్, మంచి నీరు, భారీ టెంట్స్ వంటివి పలు ఏర్పాట్లు చేస్తుమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి, ముధోల్ మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విట్టల్ రెడ్డి, ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, బార్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి, సరంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్, జిల్లా తాజా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలుక రమణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను, పూదరి అరవింద్, కొంతం గణేష్,పట్టణ, మండల, నాయకులు, తదితరులు ఉన్నారు.
మండుటెండలో సభ ఏర్పాట్ల పరిశీలన..
నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో సూర్యుడు తన ప్రతాపాన్నిఉగ్రరూపం దాల్చి చూపుతున్నాడు ఈ తరుణంలో ఈనెల 5 న నిర్మల నిర్వహించుకునే కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ల సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ముధోల్ మాజీ ఎమ్మెల్యేలు భోస్లే నారాయణరావు, పటేల్ విట్టల్ రెడ్డి ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు సుమారు గంటన్నర పాటు మండుటెండలో ఏర్పాట్లను పరిశీలించారు. పలు సలహా సూచనలు ఇచ్చారు. రాష్ట్ర మంత్రి సీతక్క తలపై తెల్ల సమ్మర్ క్యాప్ ఉండగా.. ఇతర నేతలు తమ వద్ద ఉన్న పార్టీ కండువాలు, ఇతర రుమాళ్లను తలకు చుట్టుకొని సమయాన్ని గడిపారు. తీవ్రమైన ఎండ కారణంగా ప్రతి ఒక్కరు ఎండ వేడిమికి ఇబ్బందులు పడ్డారు.