Rahul Gandhi Hails Telugu Language As ‘Pride of India’: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు డాలస్‌లోని ప్రవాస భారతీయులతో రాహుల్ ముచ్చటించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుందని, సమానంగా చూస్తుందన్నారు. ఏ రాష్ట్రం ఎక్కువ, తక్కువ కాదన్నారు. అలాగే భాష, సంప్రదాయాల్లో కూడా ఈ భాష నచ్చదు, ఆ భాష ఇష్టమని చెప్పడం సరైందని కాదన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషపై ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తెలుగు కేవలం భాష కాదు.. ఒక చరిత్ర, ఒక సంప్రదాయం, సంస్కృతి అన్నారు. హిందీతో పోలిస్తే తెలుగు భాష అంత ముఖ్యం కాదని ఒకవేళ ఆ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పినట్లయితే.. వారిని మీరు అవమానించినట్లేనన్నారు. తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, పూర్వీకులు ముఖ్యం కాదని మీరు చెప్పినట్లేనని రాహుల్ అన్నారు.