Trending Now

Rain Alert: మరో అల్పపీడనం.. విజయవాడలో మళ్లీ వర్షం

Another depression in the Bay of Bengal: బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారనుందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంపై రుతుపవన ద్రోణి విస్తరించి ఉండడంతో ఈ నెల 9వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇదిలా ఉండగా, విజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీ వరద రావడంతో విజయవాడ ఇంకా జల దిగ్భందంలోనే ఉంది. మళ్లీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

Spread the love

Related News

Latest News