Trending Now

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..

ప్రతిపక్షం, హైదరాబాద్: రాష్ట్రంలో గురు, శుక్రవారాలు అక్కడక్కడ వర్షాలు కురుస్తామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అధికారులు అరెంజ్ అలర్టు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మొస్తరు వర్షాలు కురిసే అవకావముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు భారత వాతావరణ శాఖ అన్నదాతకు చల్లని కబురు చెప్పింది. ఏ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా (నాలుగు రోజులు అటూ ఇటుగా) రానున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రా తెలిపారు.

గతనెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4 నెలల నైరుతి సీజన్‌లో జూన్‌, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలల్లోనే ఖరీఫ్‌ సాగు ఎక్కువగా సాగుతుంది. ఈ రెండు నెలల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని మహాపాత్రో వివరించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని కేంద్రం ప్రకటించింది. ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ భారత దేశంలో గురువారం నుంచి ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

Spread the love

Related News

Latest News