Trending Now

ఆకాల వర్షాలు, ఆపార నష్టం..

ఉక్కపోత నుంచి ఉపశమనం..

పలు జిల్లాల్లో ఆరెంజ్​ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 50-,60 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్రవారం నాడు కురిసిన ఆకాల వర్షానికి పంట నష్టం జరిగింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. శనివారంనాడు మహబూబ్​నగర్​, హైదరాబాద్​తో పాటు పలు జిల్లాలలో జల్లులు కురిసాయి.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు సూచనలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం వరకు మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం..

ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్‌లో వర్షం కురియడంతో ఒక్కసారి చల్లపడింది. హైదరాబాద్​తో పాటు రంగారెడ్డి జిల్లా షాబాద్‌, ఆదిబట్ల, షాద్​నగర్​, చార్మినార్‌, నాంపల్లి, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, కాచిగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌నగర్‌, బాగ్లింగంపల్లి, రాంనగర్‌, అడిక్‌మెట్‌, ఖైరతాబాద్‌, లక్టీకపూల్‌, తార్నాక, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, మాదాపూర్‌, బడంగ్‌పేట, జల్‌పల్లిలో చిరుజల్లులు పడ్డాయి. దీంతో నగరమంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. తప్పక వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Spread the love

Related News