Trending Now

Rajinikanth: ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్

Rajinikanth discharged from Chennai hospital: సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. సెప్టెంబర్ 30న ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్ వేశారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. కాగా, రజినీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. ఇందుకు ట్రాన్స్ కాథెటర్ పద్దతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఇక, రజినీ కాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ ఈనెల 10న విడుదల కానుంది.

Spread the love

Related News

Latest News