Trending Now

దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచిన మహానీయుడు రాజీవ్ గాంధీ..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21: దేశంలో సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని పెంచేందుకు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన కృషి మహోన్నతమైనదని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మంగళవారం మధ్యాహ్నం నిర్మల్ పురపాలక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితుల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉండి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దేశంలో సాంకేతిక విద్య వైజ్ఞానిక రంగాల అభివృద్ధికి దివంగత నేత రాజీవ్ గాంధీ చేసిన కృషి వల్లనే దేశంలో సాంకేతిక రంగం ప్రపంచంలోనే ముందుందని చెప్పారు. నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి మాట్లాడుతూ వివేకవంతమైన ఆలోచన ధోరణితో దివంగత నేత మాజీ ప్రధాని దేశ అభివృద్ధి కోసం తనదైన రీతిలో ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లారని చెప్పారు. రాజీవ్ గాంధీ మరణ వార్త విన్న దేశమంతా అప్పుడు కన్నీళ్ల పర్యంతమైందన్న విషయాన్ని నవ సమాజం గుర్తించాలన్నారు.

గాంధీ కుటుంబీకులు అనుక్షణం దేశ అభివృద్ధి,సమగ్రత, సమైక్యత కోసమే కష్టపడుతూ తమ సుస్థిర పాలనల వలన అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నిర్మల్ పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్ను, కాంగ్రెస్ యువజన విభాగం సీనియర్ నాయకులు సయ్యద్ అర్జుమంద్, మున్సిపల్ కౌన్సిలర్లు తారక రఘువీర్ శ్రీ వాణి, ముజాహిద్ చావుష్, శేఖ్ సలీం, మహమ్మద్ అన్వర్ పాషా, మహమ్మద్ రఫీ, అబ్దుల్ మతిన్, నాయకులు ముడుసు సత్యనారాయణ, పెండం శ్రీనివాస్, ఎంబరి గంగయ్య, తిరుమల్ రావు, భూపతి, జాఫర్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News