ప్రతిపక్షం, తెలంగాణ: రాజసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. తెలంగాణ నుంచి 3 స్థానాలకు ముగ్గురే బరిలో ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, ప్రతిపక్ష బీఆర్ ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర ఎన్నికయ్యారు.