Trending Now

ఆధ్యాత్మిక చింతనతోనే శాంతి, సామరస్యం..

షాద్ నగర్‌లో ఘనంగా రంజాన్ ఈదుల్ ఫితర్ పండుగ

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆధ్యాత్మిక చింతనతోనే సమాజంలో శాంతి సామరస్యం నెలకొంటాయని సదర్ ఖాజి సయ్యద్ ముక్తదిర్ అలీ అన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ఈదుల్ ఫితర్ ప్రార్ధనలను పురస్కరించుకొని ఆయన సందేశం ఇచ్చారు. వేలాదిమంది ముస్లిం సోదరులు ప్రార్థనలకు హాజరయ్యారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక జర్నలిస్టులు కేపీ అప్సర్ తదితరులు ఈద్ సందర్భంగా ఎమ్మెల్యే తదితర నేతలతో అలై బలై తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రంజాన్ పవిత్రత విశిష్టత గురించి చర్చించారు. ముస్లిం మతస్థులకు అత్యంత ముఖ్యమైనది రంజాన్ పండుగ. ముస్లింలు నెలపాటు నియమాలతో కూడిన కఠినమైన ఉపవాస దీక్షలు చేపట్టి ఈ నెలలో వారు అధికంగా దానధర్మాలు చేస్తారని కొనియాడారు. రంజాన్ మాసంలో చేసే దానాలకు అధిక ప్రాముఖ్యత ఉందని ఈ దానాల్లో రెండు రకాలున్నాయని జకాత్, ఫిత్రా. జకాత్ అంటే ముస్లిం మతస్థులు తమ సాంవత్సరిక ఆదాయం, ధనంలో 2.5 శాతం డబ్బు అవసరమున్న, పేదవారికి సాయం చేయాలనీ ఈ జకాత్‌ను రంజాన్ నెలలో లెక్కగట్టి చెల్లిస్తారని వారు పేర్కొన్నారు. ఫిత్రా దానధర్మాలు ఫిత్రా ధార్మిక విధానం కింద అభాగ్యులకు, పేదవారికి దానం చేస్తారనీ తిండి, బట్టలకు నోచుకోని వారికి వీరు సాయం చేస్తారని దేవుడు తమకిచ్చిన జీవితం, సుఖ, సంతోషాలకు కృతజ్ఞతగా ముస్లిం సోదరులు లేనివారికి ఈ దానం చేస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో భీష్వ కిష్టయ్య, మాది జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగనూరు విశ్వం, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, జమ్రుద్ ఖాన్, అందే మోహన్, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య , అగ్గనూరు బసవప్ప, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రఘు, సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు ఈగ వెంకట్రామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, బచ్చలి నరసింహ, రాయికల్ శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News