Trending Now

రంజాన్ ముబారక్ చిత్రం ఆవిష్కరించిన రుస్తుం..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 10: రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేట లో బుధవారం నూరే ఈదుల్ ఫితర్ ‘రంజాన్ ముబారక్’ చిత్రాన్ని ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని అన్నారు. రంజాన్ పండుగ సోదరభావం, సహజీవనం సామరస్యం, ఐకమత్యానికి ప్రతీక అని బిదవాడు ఆకలితో అలమటిస్తుంటే ధనవంతులు స్పందించాలని, జఖాత్ విధిగా ఉన్నవారు, లేనివారికి ఉన్నదాంట్లో కొంత రెండున్నర శాతం, తప్పకుండా దానము చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసల్లం అల్ ఖురాన్ లో తెలియజేశారన్నారు. దానివల్ల ఎంతోమంది బీదల పాలిట మహాదానం ఫిత్రా సహకారం అందించి వారి బాధలు తీర్చాలన్నారు.

అల్ ఖురాన్ విధి విధానాలను పాటించి అల్లాబీతితో ఆరోగ్యంగా ఐకమత్యంగా భక్తి దేశభక్తి తో ఉండాలన్నారు. రంజాన్ పండుగ ప్రపంచ మానవాళికి సామరస్యం సౌభాతృత్వం ఐకమత్యం, సుఖ, సంతోషాలు, శాంతి భద్రతలు అందించాలని, మానవతా చిత్రకారులు రుస్తుం ప్రపంచ మానవాళి అందరికి రంజాన్ ముబారక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్యచిత్రకారుడు నహీంరుస్తుం, మహ్మద్ రహీం, నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం, మహ్మద్ సాధిక్, తదితరులు పాల్గొని రంజాన్ ముబారక్ తెలియజేసారు.

Spread the love

Related News

Latest News