Trending Now

సిద్దిపేట లోహిత్ సాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..

జీర్ణాశయంలో ఏర్పడ్డ క్యాన్సర్ కణితిను తొలగించిన వైద్యులు

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 03: తొగుట మండలం పల్లెపహాడ్‌కు చెందిన రహమాన్ అనే (50) నిండిన వ్యక్తికి కడుపులోని జీర్ణాశయంలో క్యాన్సర్ కణితి ఏర్పడడంతో అరుదైన శాస్త్ర చికిత్స చేసి దానిని తొలగించడం జరిగిందని సిద్దిపేట పట్టణంలోని లోహిత్ సాయి ఆసుపత్రి చైర్మన్, వైద్యులు ఏ. భాస్కర్ తెలిపారు. కడుపులో క్యాన్సర్ కణితి ఏర్పడిన ఆ నిరుపేద వ్యక్తి చికిత్స కోసం హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు క్యాన్సర్ కణితిను తొలగించడానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు తెలిపారని అన్నారు. దీంతో తమ ఆసుపత్రికి వచ్చి సంప్రదించారని తెలిపారు. ఈ సమస్యను గుర్తించి అతి తక్కువ ఖర్చుతో అరుదైన శస్త్ర చికిత్సను చేసి ఈ క్యాన్సర్ కణితిను తొలగించడం జరిగింది అని అన్నారు. సిద్దిపేట జిల్లా వాసులకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్యాన్ని మా ఆసుపత్రిలో అందిస్తున్నామన్నారు.

Spread the love

Related News

Latest News