శోభాయమానంగా దీపాలతో ఆలయ అలంకరణ..
ప్రతిపక్షం, నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 24 : నిర్మల్ జిల్లా మండలంలోని పొన్కల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం తెల్లవారుజామున రథోత్సవాన్ని వైభవంగా, సాంప్రదాయ పద్ధతులలో నిర్వహించారు. ఆలయాన్ని వినూత్నమైన రంగురంగుల దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మంగళవారం రాత్రి ఆలయంలో హోమం, విష్ణు సహస్రనామ పారాయణం, రథ టాప్ బలి తదితర వంటి ప్రత్యేక పూజలు చేశారు. కోరిన కోర్కెలు తీర్చే వెంకన్నకు భక్తులు ముడుపులు సమర్పించుకొని, తమ కుటుంబాలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది రథాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో అర్చకులు విజయసారథి, రామచంద్రాచార్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వీడీసీ, ఆలయ కమిటీ సభ్యులు, 110 మంది వెంకన్న సేవకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.