Ravi Teja’s son as assistant director of Prabhas’ film!: మాస్ మహారాజ్ రవితేజ కొడుకు మాధవన్ గుర్తున్నాడా.. ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్‌ను ప్లే చేసింది అతడే. ఒక స్టార్ హీరో కుమారుడెవరైనా తాను కూడా హీరో కావాలనే అనుకుంటారు.. కానీ రవితేజ కుమారుడు మాధవన్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు.. తనకు యాక్టింగ్ కంటే డైరెక్షన్ అంటేనే ఇష్టమట. ఇంకేముంది.. తనకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిపోయాడు. అంతేకాదు.. ఏకంగా ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడట. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.





























