ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: T20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్-8 మ్యాచ్‌లను విండీస్ వేదికగా ఆడనుంది. ఇందులో తమ బౌలింగ్ వ్యూహాన్ని భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా వివరించారు. ‘‘ఎప్పుడు విండీస్‌లో ఆడినా.. అక్కడి పిచ్‌లు చాలా మందకొడిగా ఉండి పొడిబారినట్లు ఉంటాయి. మ్యాచులన్నీ ఉదయం కావడంతో స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం’’ అని తెలిపారు.