Ravindra Jadeja joins BJP: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని ఆయన భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా ఎక్స్ వేదికగా వెల్లడించారు. జడేజా బీజేపీ సభ్యత్వాన్ని ధ్రువపరిచే ఫొటోలను ఆమె ఎక్స్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుజరాత్‌లోని జామనగర్ సెగ్మెంట్ లలో బీజీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన రివాబా జడేజా విజయం సాధించింది. అయితే ఎన్నికల సమయంలో భార్య తరపున ప్రచారం చేసిన జడేజా..తాజాగా, బీజేపీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా పార్లమెంటరీ మెంబర్ షిప్ తీసుకున్నాడు.