ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL ప్లేఆఫ్స్‌లో ఆఖరిదైన 4వ బెర్తు కోసం ఈరోజు చెన్నై, బెంగళూరు తలపడనున్నాయి. బెంగళూరులో జరగాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం ఆర్సీబీని కలవరపరుస్తోంది. ఎందుకంటే.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో చెన్నైపై ఆర్సీబీ కచ్చితంగా గెలిచి తీరాలి. అంతేకాదు.. ఆ జట్టు కంటే మెరుగైన రన్‌రేట్ సాధించాలి. మరోవైపు ధోనీకి ఇదే చివరి IPL అని భావిస్తున్న తరుణంలో మరోసారి ఫైనల్ చేరి కప్ కొట్టాలని తలా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ముంబై ఇండియన్స్ ఓటమి..
వాంఖడేలో నిన్న LSGతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI, 196 రన్స్‌కే పరిమితమైంది. రోహిత్ శర్మ (68 రన్స్), నమన్ ధీర్ (62 రన్స్) రాణించారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, నవీన్ చెరో 2 వికెట్లు, కృనాల్, మొహ్‌సీన్ చెరో వికెట్ తీశారు. కేవలం 8 పాయింట్లున్న ముంబై టేబుల్‌లో అట్టడుగు స్థానంతో సీజన్‌ను ఫినిష్ చేసింది. LSG గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది.
ముంబై ఖాతాలో రెండోసారి ఆ చెత్త రికార్డు..
ముంబై ఇండియన్స్ మరోసారి చివరి స్థానంలో నిలిచి చెత్త రికార్డు మూటగట్టుకుంది. 2022లోనూ 10వ స్థానంలో నిలిచిన ముంబై.. ఈసారి కూడా పదో స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది ప్లేఆఫ్స్ చేరిన ఆ జట్టు ఈసారి ఫైనల్ చేరి కప్పు కొడుతుందని ముంబై అభిమానులు ఆశించారు. కానీ.. ముంబైకు గత మూడేళ్లుగా కలిసి రావడం లేదు. 2013 నుంచి 2020 మధ్య 8 ఏళ్లలో ఏకంగా 5 టైటిల్స్ గెలిచిన ఆ జట్టు ఆ తర్వాత కనీసం ఫైనల్ చేరలేకపోయింది.