ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐపీఎల్‌లో భాగంగా నేడు ఆర్సీబీ, కేకేఆర్ బెంగళూరులో తలపడనున్నాయి. ఇరువైపులా బలమైన హిట్టర్లు ఉండటం, చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడంతో భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రీడావిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న మ్యాచ్‌తో సహా ఇప్పటి వరకు హోం టీమ్స్ గెలిచాయి. ఈరోజు ఆర్సీబీని మట్టికరిపించి ఆ రికార్డును మార్చాలని భావిస్తోంది కేకేఆర్. అటు ఆర్సీబీ సైతం బలంగానే ఉండటంతో రసవత్తరమైన మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.