Trending Now

అపత్కాలంలో ఆపద్బాంధవులుగా ముందుకు..

తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్య రక్తదానాలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 30 : ఆపత్కాలంలో ఉన్న వారిని ఇట్టే ఆదుకొని తమదైన రీతిలో రక్తదాన లిస్టు దూసుకెళ్తున్న నిర్మల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఏక్తా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు గురువారం కూడా అదే రీతిన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అత్యవసరంగా రక్తం అవసరం ఉన్న యాస్మిన్ అనే పేషెంట్ కు రక్తదానాన్ని చేసి తమ సేవ గుణాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సొసైటీ టౌన్ అధ్యక్షులు ముసైఫ్ తమ వ్యక్తిగత నిర్ణయంతో వచ్చి రక్తదానం చేయడం జరిగిందని ఆ సొసైటీ వ్యవస్థాపకులు గౌరవ అధ్యక్షులు శేఖ్ ముజాహిద్ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఈ తరహ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో తమ సొసైటీ ముందుకెళ్తున్నదని చెప్పారు.

ఆధ్యాత్మిక బోధలను అనుసరిస్తూ సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ఇబ్బందులను గుర్తించి ఈ తరహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికీ సొసైటీ ఆధ్వర్యంలో వందలాది మందికి ఆయా రకాల రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు కరోనా లాంటి సమయంలో వినూత్నమైన సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు సాజిద్,జనరల్ సెక్రెటరీ అల్మాస్, జాయింట్ సెక్రెటరీ జుబేర్ ,సొసైటీ టౌన్ అధ్యక్షులు ముసేబ్,నిర్మల్ మండల్ అధ్యక్షులు అమాన్ . సొసైటీ సభ్యులు మొఇజ్, అజహర్, హాజీ మస్తాన్, తదితర సొసైటీ సభ్యులు కావేరి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కన్నయ్య కుమార్ పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News