నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఘటన..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ మే 9 : నిర్మల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు పోటా పోటీగా జిల్లాలోని ఆయా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రచార కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఏఐసీసీ కార్యదర్శి దీపా దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు పలువురు జాతీయ,రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించగా బీఆర్ఎస్, బీజేపీ నుండి అగ్ర శ్రేణి నేతలు ఎవరు రాలేదు. ఎన్నికల ప్రచారాలకు మూడే రోజులు మిగిలి ఉండడంతో ఆయా రాజకీయ పార్టీలు ఓటర్లను తమ వైపు ఆకర్షింపజేసినందుకు తమదైన రీతిలో ప్రణాళికలు రూపొందించుకొని ఓటర్ల తలుపులు తట్టీ తమ తమ పార్టీలకు ఓట్లను అభ్యర్థిస్తున్నాయి.
అయితే తాజాగా గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లాలోని బైంసా, నిర్మల్ పట్టణాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో కార్యక్రమాలను బీఆర్ ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసుకొని, పట్టణాలలోని ఆయా కూడా కూడళ్ళీలలో కార్యక్రమానికి సంబంధించిన పార్టీ పరమైన ప్రచార బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే భైంసా పట్టణంలో మాత్రం పురపాలక శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు సిబ్బంది వాటిని తొలగించారు. సభ సాయంత్రం పూట ఉండగా.. మధ్యాహ్నం పూటనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఎన్నికల రోడ్ షో ప్రచార బ్యానర్లను భైంసా పురపాలక శాఖ సిబ్బంది తొలగించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులలో ఆందోళన మొదలైంది.