ప్రతిపక్షం, వెబ్ డెస్క్: చిట్యాల పురపాలక సంఘం 10వ వార్డు కౌన్సిలర్ సిలువేరు మౌనిక శేఖర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక కిందిస్థాయి నాయకులని, కార్యకర్తలను పట్టించుకునేవారు లేకుండా పోయారన్నారు. వార్డు ప్రజలు యూత్ సభ్యులతో చర్చించి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.