ప్రతిపక్షం, మహబూబ్ నగర్ : బీజేపీ తరఫున తనకు మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి టికెట్ రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధపడ్డారు తప్ప అంతకు మించి తమ మధ్య ఎలాంటి అంశాలు చర్చకు రాలేదని బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్న జితేందర్ రెడ్డిని అధిష్ఠానం పక్కన పెట్టి డీకే అరుణకు అవకాశం ఇవ్వడం పట్ల ఆయన కలత చెందారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఆయన ఇంటికి వెళ్లి, కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా పరామర్శించారని, పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని జితేందర్ విలేకరులకు చెప్పారు. తన భవితవ్యాన్ని బీజేపీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. కాగా, ఇటీవలి శాసనసభ ఎన్నికలలో జితేందర్ రెడ్డి కుమారుడు మహబూబ్ నగర్ నుంచి ఓటమి పాలు కావడంతో పార్టీ అభిప్రాయంమార్చుకుందంటున్నారు.