ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి మార్చ్ 28: నిర్మల్ పట్టణ అభివృద్ధి, నిధుల కేటాయింపు, పథకాల అమలు అభివృద్ధి పనులతో పాటు పవిత్ర రంజాన్ మాసంలో కల్పించవలసిన సౌకర్యాలు ఏర్పాట్లపై గురువారం నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తో ఆయన ఛాంబర్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ మాసంలో కల్పించవలసిన సౌకర్యాలు ఏర్పాట్లపై ఆరా తీశారు. నిర్మల్ పట్టణంలో నిలిచిపోయిన వివిధ అభివృద్ధి పనులు తీసుకోవాల్సిన నిర్ణయాలు చేపట్టాల్సిన చర్యలపై సుమారు గంటపాటు చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ సాజీద్, కౌన్సిలర్లు శేఖ్ సెయిద్ సలీం, మహమ్మద్ అన్వర్ పాషా, ముజాహిద్ చావుష్ సయ్యద్ జహీర్ తదితరులు ఉన్నారు.