ప్రతిపక్షం, సినిమా: జనసేనాని పవన్ కళ్యాణ్ పై సినీ దర్శకుడు ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్ చేశారు. టీడీపీతో పొత్తులో భాగంగా తక్కువ సీట్లకే పరిమితమవడాన్ని ఉద్దేశించి.. ”గత ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవకపోవడంతో మరిన్ని సీట్లు డిమాండ్ చేయలేకపోయానని పవన్ చెప్పారు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిందని తర్వాతి సినిమాని కొన్ని థియేటర్లకే పరిమితం చేయలేదు కదా.. సినిమాలతో పోలిస్తే రాజకీయ స్థితిపై పవన్ నమ్మకంగా లేడు” అని పేర్కొన్నారు.