ప్రతిపక్షం, ఏపీ: కర్నూలు – ప్రకాశం జిల్లాల సరిహద్దు నల్లమల ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఆత్మకూరు – దోర్నాల మధ్య రోళ్ళపెంట మలుపు లో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీ లు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించేందుకు ఆత్మకూరు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.