ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ముంబై ఫ్యాన్స్ దాడిలో చెన్నై అభిమాని తీవ్రంగా గాయపడిన ఘటన MHలోని కొల్హాపూర్‌లో జరిగింది. బుధవారం రాత్రి SRHపై రోహిత్ శర్మ ఔట్ కావడంతో CSK అభిమాని బండోపంత్ టిబిలే(63).. ‘రోహిత్ ఔటైపోయాడు. ఇప్పుడు ముంబై ఎలా గెలుస్తుంది’ అంటూ హేళన చేశాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ బల్వంత్, సాగర్ పట్టరాని కోపంతో టిబిలే తలపై కర్రతో కొట్టారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.