ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టీమిండియా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచే అతడికి చివరిది. ఐపీఎల్-17 తనకు చివరిదని ఇదివరకే కార్తీక్ ధ్రువీకరించారు. డీకే ఐపీఎల్‌లో బెంగళూరుతో పాటు కోల్‌కతా, ముంబై, గుజరాత్ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లాడి 36.22 సగటుతో 326 పరుగులు చేశారు.
ఆర్సీబీ ఇంటికి..
లీగ్ స్టేజీలో వరుసగా 6 మ్యాచులు గెలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ.. కీలక పోరులో నిరాశపరిచింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. తొలుత ఆర్సీబీ 172/8 రన్స్ చేయగా.. RR 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలిచిన శాంసన్ సేన.. 24న SRHతో తలపడనుంది. అందులో గెలిచిన జట్టు 26న ఫైనల్‌లో KKRతో అమీతుమీ తేల్చుకోనుంది.
IPL హిస్టరీలో RCB చెత్త రికార్డు..
ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలనే RCB కల మరోసారి కల్లలయ్యింది. నిన్న RR చేతిలో ఓటమితో టోర్నీ ప్లేఆఫ్స్‌లో అత్యధికసార్లు(16 మ్యాచ్‌లలో 10 సార్లు) వెనుదిరిగిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో CSK(26M.. 9 ఓటములు), DC(11M.. 9 పరాజయాలు), MI(20M.. 7 ఓటములు), SRH(12M.. 7 పరాజయాలు) ఉన్నాయి. ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలవని విషయం తెలిసిందే.