ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPLలో రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన 3మ్యాచుల్లోనూ RR టాప్2లో ఉంటే.. RCB 4మ్యాచుల్లో 1 మాత్రమే గెలిచి 8వ ప్లేస్‌లో ఉంది. వరుస ఓటములతో డీలాపడ్డ RCBకి ఈరోజు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ను దాని సొంతగడ్డపైనే ఎదుర్కోనుండటం సవాలే. వీటి మధ్య 30మ్యాచులు జరగ్గా.. RR 15, RCB 12 మ్యాచుల్లో గెలిచాయి. మూడింట్లో ఫలితం తేలలేదు.