Trending Now

ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య నేడు రాత్రి 7:30కి అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఈనెల 24న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో క్వాలిఫయర్-2 ఆడుతుంది. ఓడిన జట్టు టైటిల్ రేసు నుంచి ఎలిమినేట్ అవుతుంది. వరుస విజయాలతో ఆర్సీబీ జోరు మీదుండగా.. వరుస పరాజయాలతో రాజస్థాన్ రాయల్స్ కాస్త సన్నగిల్లిన విశ్వాసంతో ఉంది.

ఫైనల్ చేరిన కోల్‌కతా..

ఐపీఎల్-2024లో ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా కోల్‌కతా అవతరించింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమితో హైదరాబాద్ క్వాలిఫయర్2లో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్‌ 159 రన్స్ చేయగా.. KKR 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. KKRలో వెంకటేశ్ అయ్యర్ 51, శ్రేయస్ 58 హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఫీల్డర్లు కీలక క్యాచ్‌లు నేలపాలు చేశారు.

Spread the love

Related News

Latest News