Rs.5 Lakh Free Health Insurance for Senior Citizens: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద ప్రజల కోసం రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు భరించనుంది. దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించేందుకు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. కాగా, ఆయుష్మాన్ భారత్ ద్వారా సుమారు 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందారు.