హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారంనాడు ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కేసీఆర్ ప్రవీణ్‌కుమార్‌ను పారట్ఈలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా తనను నియమిస్తారని వచ్చిన వదంతులపై ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించారు. తనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ ఆ పదవిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు వివరించారు.
తనకు ఏ పదవులు అవసరం లేదని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఓ వైపు పాలమూరు బిడ్డ అని చెబుతున్న రేవంత్.. మరోవైపు తాను బీఆర్ఎస్ లోకి చేరితే ప్రజలకు సమాధానం చెప్పాలనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే రేవంత్ తనకు వార్నింగ్ ఇస్తున్నట్లు అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే అందులో జాయిన్ అవడానికి తాను అసమర్థుడిని కానని.. నిజమైన, నిస్వార్థమైన, నిజాయతీ కోసం పనిచేసే వ్యక్తిని అని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.