ప్రతిపక్షం,హైదరాబాద్: ఆర్టీసీని అమ్మడం కానీ, ప్రైవేటీకరించడం కానీ చేయబోమని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లక్షల మందికి రవాణా కల్పిస్తున్న ఆర్టీసీ రాష్ట్రానికే తలమానికని, దీనిని మరింత పటిష్ఠ పరచి లాభాల బాటలో నడపమే తమ ప్రభుత్వలక్ష్యమని చెప్పారు. ఆర్టీసీ నూతన ఎలక్ట్రిక్ బస్సులను ఆయన మంగళవారం ప్రారంభించారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా సంస్థ తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే కొత్త కళ తెచ్చుకుందని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులకు, కార్మికులకు బాండ్స్ ను ఆయన అందజేశారు.