ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనంతరం సమంతకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.