Trending Now

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం..

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి/ గజ్వేల్ ఏప్రిల్ 5: రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని కుక్కునూరు పల్లి మండలంలోని మంగోల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఫిల్టర్ హౌస్, ల్యాబ్, 75 మిలియన్ లీటర్స్ క్లియర్ వాటర్ రిజర్వాయర్, కొండపాకలో ఇంటర్మిడియేట్ పంపు హౌస్, ఆక్కారం 40 ఎం ఎల్ సంప్ హౌస్, తిప్పారం మల్లన్న సాగర్ పంప్ హౌస్ లను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా మాట్లాడుతూ.. వేసవి సీజన్లో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారానీటిని సరఫరా చేసేందుకు కలెక్టర్ లను ఆదేశించినట్లు తెలిపారు. . ఎక్కడైనా నీటి సరఫరాలో ఏదైన సమస్య తలెత్తితే టైం బాండ్ ప్రకారం నీటి సరఫరాను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టాము.

త్రాగునీటి సరఫరాలో చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉన్న రిజర్వాయర్ల నుంచి కూడా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఏ స్థితిలో కూడా ప్రజలకు ఇబ్బంది రాకూడదనే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ప్రతిరోజు కలెక్టర్లు రివ్యూ చేసి చర్యలు తీసుకుంటున్నారు. 6న ఏజెన్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. మా స్థాయిలో కూడా ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఏజెన్సీలను కూడా అప్రమత్తం చేసి ఎక్కడైనా మోటార్స్ కరాబ్ అయినా వెంటనే రిపేర్ చేయిస్తున్నామనీ చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు గ్రామాలను విసిట్ చేసి వాటర్ సమస్య రాకుండా చూడాలని, ప్రతి మండలంలో 1హెచ్ పీ, 3హెచ్ పీ మరియు 5 హెచ్ పీ మోటార్లను స్పేర్ లో ఉంచుకోవాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే గ్రామాలలో అవసరమైతే పక్క గ్రామాల ట్రాక్టర్లను కూడా వాడుకోవాలని అన్నారు.

Spread the love

Related News