ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని ఈసీని చింతా ప్రభాకర్ కోరారు.