Trending Now

మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సాంప్రదాయ ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా సరికొత్త పంథాలో పయనిస్తోంది. క్రౌన్ ప్రిన్స్‌గా మహమ్మద్ బిన్ సల్మాన్ ఆ దేశ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత సౌదీ అరేబియాలో నెమ్మదిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మహిళల హక్కులకు ప్రాధ్యాన్యత లేని దేశంగా ఉన్న ఆ దేశం చరిత్రలోనే తొలిసారిగా ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొనబోతోంది. దీనికి సంబంధించి 27 ఏళ్ల మోడల్ రూమీ అల్ఖాహ్‌తానీ సోషల్ మీడియాలో తొలిసారిగా సౌదీ అరేబియా తరఫున అధికారికంగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రూమీ వెల్లడించారు. అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా నిలవనుంది.

Spread the love

Related News

Latest News