ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: APలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు జనసేనాని పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 30న నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 31న ఉప్పాడ సెంటర్‌లో వారాహి యాత్ర బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక ఏప్రిల్ 1వ తేదీన పార్టీలో చేరికలు, నియోజకవర్గంలోని మేధావులతో సమావేశం కానున్నారు.