Second Monkeypox case confirmed: భారత్లో మంకీపాక్స్ రెండో కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మలప్పురం జిల్లాకు చెందిన ఆయనకు మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయనకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కాగా, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది. అయితే రోగులు సాధారణంగా వైద్య సంరక్షణతో కోలుకుంటారు. అయితే ఈ వ్యాధి సోకిన రోగితో సన్నిహిత సంబంధం ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.