Trending Now

‘పుష్ప 2’ నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ శ్రీవల్లి అనౌన్స్మెంట్ వీడియో నేడు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.. తాజాగా సెకండ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’.. అంటూ ఈ పాట సాగనుంది. ఈ సాంగ్ లో శ్రీవల్లిగా రష్మిక తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో ఆకట్టుకోనుంది. అయితే ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు.

Spread the love

Related News

Latest News