ఆదివాసి తెగల పిల్లలకు అన్యాయం
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 13 : 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను గిరిజన బాలబాలికల బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాల ఎంపికలో ఆదివాసి తెగల పిల్లలకు అడగడుగునా అన్యాయాల జరిగాయని ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంక గారి భూమయ్య ఆరోపించారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేసిన ఏకపక్షంగా ఒకే తెగకు చెందిన 22 విద్యార్థులను ఎంపిక చేయడం శోచనీయమన్నారు.నిర్మల్ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన ఆదివాసులకు, నాయకపోడు తెగకు పూర్తిగా అన్యాయం జరిగిందని విమర్శించారు.జిల్లా కలెక్టర్ మరోసారి సమీక్షించి అసలైన ఆదివాసుల పిల్లలకు న్యాయం చేసే దిశగా పకడ్బందీ ప్రణాళికతో ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు.. అర్హులైన ఆదివాసి పిల్లలను పక్కనపెట్టి వలసవాదులైన లంబాడాలని ఎంపిక చేయడం పట్ల అభ్యంతరం ఆయన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఎంపికలో జరిగి అన్యాయాన్ని ,సరి చేసుకోవాలంటే 9 తెగలలో న్యాయం జరగాలని లేదంటే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.డి టిడి ఓ కార్యాలయంలో మొత్తం లంబాడాల ఉద్యోగులే ఉండడం వలన ఆదివాసి తెగలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఆది వాసి తెగలకు చెందిన వారినే డిటిడిఓగా నియమించాలని లేదంటే ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.ఇప్పటికైనా ఆదివాసి తెగలు వారందరూ జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండి న్యాయం చేసేంతవరకు ముందుకెళ్దామని సూచించారు. బెస్ట్ అవైలబుల్ ఎంపికను రద్దుచేసి మరోసారి ఎంపిక చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకపోడు తెగకు చెందిన విద్యార్థి ఎంపిక కాగా, పిటిజినుండి నలుగురు విద్యార్థులు ఎంపిక చేశారని, గోండు తెగ నుండి ఒక విద్యార్థిని ఎంపిక చేశారని, అంటే అదిలాబాద్ జిల్లా మొత్తం లంబాడాలే ఉన్నారా..? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, ఆదివాసి తెగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ఆందోళనలు చేపట్టవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.