Trending Now

మోడీది రెండు నాల్కల ధోరణీ..

తెలంగాణకు వచ్చి నీతులు వల్లింపు..

ఏపీలో బీజేపీ కూటమీ ముస్లీం రిజర్వేషన్లు పెంచుతామంటూ హామీ?

ఇక్కడేమో రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ ప్రకటన.. వీహెచ్​ ఆగ్రహం

ప్రతిపక్షం, స్టేట్​బ్యూరో, హైదరాబాద్​: ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్​ సీనియర్​ నేత వి. హన్మంతరావు తీవ్రస్థాయిలో ఫైర్​ అయ్యారు. శనివారం గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడుతూ మోడీది రెండు నాల్కల ధోరణీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముస్లీంల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ చెబుతున్న మోడీ, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమీ విడుదల చేసిన మెనిఫెస్టోలో ముస్లీం రిజర్వేషన్లు పెంచుతామని, ఇమాం, మోజంలకు నెల నెల జీతాలు పెంచుతామని, ఏపీలో ప్రత్యేకంగా హాజ్​హౌజ్​ను నియమిస్తామంటూ పేర్కొనడంపై వీహెచ్​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణాలో సీఎం రేవంత్​ను అవినీతి పరుడని, ఆర్​ఆర్​ ట్యాక్స్​ అంటూ నిందించడాన్ని ఆయన ఖండిచారు. టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు సుజనాచౌదరి, సీఎం రమేశ్​లు బ్యాంకులను దోపిడీ చేశారని, ఈడీ, ఐటి దాడులు చేసి కేసులు నమోదు చేశారని, వారు బీజేపీలో చేరిన వెంటనే ఎలాంటి కేసులు లేవని తెలిపారు.

అలాంటి అవినీతి పరులను పక్కకు పెట్టుకోవడమే కాక, ఒకరికి ఎంపీ, మరొకరికి అసెంబ్లీ టికెట్లు ఇచ్చారంటూ మండిపడ్డారు. ఇండియా కూటమికి మోదీ భయపడుతున్నారన్నారు. రజాకార్ల పాట ఎన్ని రోజులు పాడతారని అన్నారు. రజాకార్లు ఉన్నప్పుడు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. అదానీ, అంబానీలకు మాత్రమే మోదీ న్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మోడీ సభలను చూసేందుకు విమానల్లో టికెట్లు పెట్టుకొని వస్తున్నారని మోదీ పేర్కొనడంపై ఆయన ఎద్దేవా చేశారు. ఈయనేమైనా అమితాబ్ అనుకుంటున్నాడా? షారూఖ్ అనుకుంటున్నాడా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మణిపూర్‌లో మహిళల బట్టలు విప్పి నడిపిస్తే మోదీ మాట్లాడారా అని ప్రశ్నించారు. కనీసం ఆ రాష్ట్రానికి వెళ్లి పరామర్శించలేదని దుయ్యబట్టారు. కులగణన చేస్తామని 2008లో బీజేపీ నాయకులు అన్నారని.. ఇప్పటిదాకా చేయలేదన్నారు. గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోశారన్నారు. ‘‘నా పేరే హనుమంతుడు. నేను రాముడి భక్తుడిని. నేను సచ్చేదాకా కాంగ్రెస్‌లోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తా’’ అని వీహెచ్ స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News