CM Revanth Reddy Padayatra: మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు పాదయాత్రకు సంబంధించి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 8వ తేదీన తన పుట్టినరోజు సందర్బంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి పాదయాత్ర గా వెళ్లనున్నారు. అదే రోజు భువనగిరి నుంచి వలిగొండ వైపు నది వెంబడి ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉంది. అలాగే భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పైపులైన్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితుల గోడు విననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం విప్ చీర్ల బలయ్య, హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.

 
								 
								 
															




























 
															