ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నామత్కర్ నవీన్..
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 8 : ఖానాపూర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నామత్కార్ నవీన్ విమర్శించారు. సోమవారం ఉదయం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక బడుగు, బలహీన పేద విద్యార్థులు చదువుకోవడానికి స్తోమత లేక చదువు మధ్యలోనే ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినిధులకు అనేక సందర్భాలలో వినవించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం.. వస్తుంది.. ఆ సంవత్సరం వస్తుందంటూ.. మాటలు చెప్పి కాలాన్ని గడిపేశారని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అవుతుందా అని ప్రశ్నించారు. వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత్, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.