Trending Now

ఖబర్దార్ మతోన్మాద గుండాల్లారా..

ఏబీవీపీ దాడిని ఖండిస్తూ.. నిర్మల్‌లో ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 18 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నాయకులపైన జరిగిన దాడిని ఖండిస్తూ.. ఈరోజు ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద వ్యతిరేక నినాదాలు చేస్తూ.. ఆందోళన చేపట్టారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న బుధవారం అర్ధరాత్రి ఎస్ఎఫ్ఐ నాయకులపైన జరిగిన ఏబీవీపీ మతోన్మాద గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నామత్కర్ నవీన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ కూటమి విద్యార్థి సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది అన్నారు. అది తట్టుకోలేక ఏబీవీపీ మతోన్మాద గుండాలు, ప్రతిరోజు ఏదో ఒక దాడికి ఎస్ఎఫ్ఐ నాయకుల పైన పాల్పడుతున్నారన్నారు. ఎదురుగా నిలబడే దమ్ము లేక అక్రమంగా విద్యార్థి, విద్యార్థి సంఘ నాయకుల పైన దాడులు చేస్తూ.. యూనివర్సిటీలో ఒక గుండా రాజకీయాలను చేస్తున్నారన్నారు.

ఈ దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల, విద్యార్థి నాయకులపైన దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దమ్ములేని మతోన్మాద సంఘం విద్యార్థులపైన దాడి చేయడం హేయమైన చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. మీకు దమ్ముంటే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. మీ బలం ఏంటిదో మొన్న జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో తెలిసిందన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపైన రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు చట్టబరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా.. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటి లల్లో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయి, సత్యం రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News