ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పౌల్ట్రీ రైతులపై విధించిన ప్రాపర్టీ టాక్స్ (ఆస్తి పన్ను) మినహాయింపు ఎంతైనా సమంజసమేనని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి రైతాంగానికి న్యాయం చేయడం సముచిత ధర్మమని పౌల్ట్రీ రైతులు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి పాత బకాయిల వసూలు గురించి.. షాద్ నగర్ మున్సిపాలిటీ పౌల్ట్రీ రైతులకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక ఎమ్మెల్యేను పౌల్ట్రీ నాయకులు కలిశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేకంగా కలుసుకుని తమ సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం హర్షనీయమని వారితో అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని అనుసరిస్తూ పాతబాకిలను పూర్తిగా రద్దు చేయమని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరడం పట్ల అభినందించారు. రైతాంగం సమస్యలను ప్రభుత్వం పట్టించుకుని తమకు ఉపశమనం కల్పిస్తే ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప మేలు చేస్తుందని వారు అన్నారు. చటాన్ పల్లి మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి పౌల్ట్రి రెైతులు కాపారామారావు, మదమంచి ఆనందరావు, వెంకట్ నారాయణ, మన్నవ సాంబశివరావు, అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.