Trending Now

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: షాద్ నగర్ నియోజకవర్గంలోని చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని “వై జంక్షన్” నిర్మాణం కోసం పూర్తిస్థాయిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి చేస్తారన్నారని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన, నాయకులు, అభిమానులు కలుసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ఆయనకు స్వయంగా కలుసుకొని పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మంత్రితో కాసేపు మాట్లాడినట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, భవనాలు, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయాల్లో మంత్రి తన శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందజేయాలి అన్నట్టు చెప్పారు. నియోజవర్గ రాజకీయాల్లో తనదైన మార్క్ ను వేస్తానని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు.

హ్యాపీ బర్త్ డే మంత్రి గారూ..

హ్యాపీ బర్త్ డే అన్నా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యే శంకర్ ఆప్యాయంగా అభినందనలు తెలిపారు. గురువారం మంత్రి కోమటిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆయన వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో న‌ల్గొండ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారని, ఆయన ఆ తరువాత 2004, 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన డైనమిక్ లీడర్ అని కొనియాడారు.

ఆయన వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాలలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 4500 ఓట్ల మెజారిటీతో గెలిచాడని అభినందించారు. 2022 ఏప్రిల్ 10న కాంగ్రెస్ అధిష్టానం ఆయనను 2023 శాసన సభ ఎన్నికల టీ కాంగ్రెస్‌కు స్టార్‌ క్యాంపెనర్‌గా నియమించింది.

ఆయనను 2023 సెప్టెంబరు 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, డిసెంబర్ 07న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, డిసెంబర్ 10న తెలంగాణ సచివాలయంలోని 5వ అంతస్తు తన చాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవలను ఎమ్మెల్యే శంకర్ కొనియాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అభినందనలు తెలిపిన వారిలో కాంగ్రెస్ యువ నాయకులు ముబారక్ ఖాన్, సయ్యద్ ఖదీర్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News