Eluru Mayor Sheikh Noorjahan Resign YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి వీడారు. తాజాగా, ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేశారు. మంగళవారం తన భర్త పెదబాబుతో కలిసి టీడీపీలో చేరనున్నారు.
సీఎం చంద్రబాబు సమక్షంలో నూర్జహాన్ దంపతులు పసుపు కండువా కప్పుకోనున్నారు. వీరితోపాటు ఏలూరులోని కార్పోరేటర్లు, ముఖ్యనేతలు టీడీపీలో చేరనున్నారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, మేయర్ దంపతులు టీడీపీలోకి వస్తుండడంతో ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ దక్కించుకోనుందని అనుకుంటున్నారు.