ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి బుధవారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకావడం లేదని ఫ్యామిలీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.